అమ్మ భాష
తేదీ : 29-08-2021
సంఖ్య : 30+14
మాతృ భాష తెలుగు
మన మాతృ భాష తెలుగు
మరువకెపుడు దాని వెలుగు
అమ్మ నోట రాలిన ముత్యం
అభ్యసించి నేర్చిన సత్యం
అమ్మ భాష తేనెల మధురం
ఆర్తినంత రంగరించు భావం ... //మాతృ//
అక్షరాలన్నీ వర్తులాకారం
అనువైన సులువు ఉచ్చారణం
అచ్చులలోన పొట్టీ పొడువులు
హల్లుల్లోన సరళ పరుషములు //మాతృ//
ఒత్తులన్నీ ద్విత్తం సంయుక్తం
అక్షరాలను కలిపిన గుణింతం
అచ్ఛులతోనే పదాలు అంతం
విశ్వమందు ఆది ద్వితీయం //మాతృ//
అధ్యయించు పర భాషలు
అన్వయించు అవసరార్థం
అమ్మిచ్చినది నీకు జననం
అమ్మ భాషే నీకు అస్థిత్వం //మాతృ//
అమ్మయినా అమ్మ భాషైనా
ఆనవాళ్లనెపుడూ మరవద్దు
మననమెంతో మనసు ప్రియం
తలుచుకుంటేనే జన్మ సౌఖ్యం //మాతృ//
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment