మాటల గంధం
తేదీ : 09-08-2021
శీర్షిక : ఔషధ లేపనం ....
కవిత సంఖ్య : 30+5
కలకాలం నిలవని కష్టాలు
ఎల్లకాలం ఆశించే సుఖాలు
అప్పుడప్పుడోచిపోయే దుఃఖాలు
శాశ్వతమై పోవాలనుకునే ఆనందాలు
అన్నీ కల కలిస్తేనే జీవన పయనం ....
అంగవైకల్యమో అవిటితనమో
ఆర్ధిక లేమితో అతలాకుతలమయ్యే
ఆనాధలు ... అభాగ్యులైతే ... శాశ్వత
దుర్బలత్వాలకు దన్నుగా ...
వీలైన ఆపన్న హస్తం ... కోరుకుంటుంది ...
అన్ని విధాలా బాగున్న మనిషికి
అప్పుడప్పుడోచ్చిపోయే కష్టాలకు,
కాలగమనపు అనారోగ్యాలకు ,
కఠిన దుఃఖాలకు... తుఫానులో తల్లడిల్లే
వృక్షంలా అతలాకుతలమౌతున్నవేళ...
మనిషి మనసు ఔషధ లేపనం
లాంటి నాలుగు మంచి మాటలు
కోరుకుంటుంది .... మాటల సుగంధాలు
మల్లెలు పూయించగలిగితే ...
మనోధైర్యాలకు మంత్రశక్తి
ఆపాదితమౌతుంది ...పట్టుదలలకు
పెట్టుబడిగా నిలిచి శ్రమలకు పట్టం
కట్టి....కాల గమనాల గతుకుల్లోంచి
గట్టెక్కించి...మానసిక ప్రశాంతతలకు
మూలమై... సాధారణాలకు చేరువ
చేస్తుంది ....
మనిషి సంఘజీవి... బుద్దిజీవి
నలుగురితో నడుస్తాడు ...నలుగురిలో
కలుస్తాడు ..... నవ్వుతాడు...
జాలి దయ క్షమ కరుణ త్యాగాలకు
స్పందించే మృదు స్వభావి .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment