Thursday, October 21, 2021

శ్రీ కృష్ణాష్టమి తేదీ - 30-08-2021

 శ్రీ కృష్ణాష్టమి

తేదీ - 30-08-2021             
శీర్షిక : గీతాచార్యుడు ... 
కవిత సంఖ్య : 158    

వసుదేవ సుతం దేవం - 
కంస చాణూర మర్దనం
దేవకీ పరమానన్దం - 
కృష్ణం వందే జగద్గురుమ్

దేవకీ వసుదేవుల అష్టమ 
గర్భంగా ... శ్రావణ బహుళ 
అష్టమి తిథి రోహిణి నక్షత్రం 
పరంధాముని జననం ….. 

నందగోకులంలో పెరిగి 
యశోదమ్మ ముద్దుల తనయుడై 
మన్ను తిన్నాడని మందలించ 
అండ పిండ బ్రహ్మాండములను 
చూపి అమ్మకు ఆనందాశ్చర్యములను 
కలిగించిన అల్లరి పిడుగు ..... 

కాళింది పై నాట్యమాడినా 
గొల్లభామల చీరలెత్తుకెళ్లినా 
గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని 
గర్వమణచిన ఇగురాశాలి ..... 

అనుక్షణం  పాండవుల 
నంటిపెట్టుకున్న ధర్మ పక్షపాతి 
ద్రౌపదమ్మకు వస్త్రాపహరణంలో 
రక్షించిన అనుంగు సోదరుడు .....                        

దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షార్థం 
అవతరించిన లీలావతారం
ద్వాపార లో దర్శన భాగ్యం 
గీతాచార్యుడిగా సత్యదర్శనం…. 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment