Thursday, October 14, 2021

పూల వర్షం తేది :24-08-2021

 పూల వర్షం 

తేది :24-08-2021
శీర్షిక : నవ సమాజ నిర్మాతలు 
కవిత సంఖ్య : 156

యుగాలు మారినా జగాన తేజం 
రఘురాముని పాలనే ఘన దృష్టాంతం 
అడవికి వెళ్తున్నా ఆగని ప్రేమలు 
గుండెల్లో కోవెల కట్టి కురిపించిరి 
పూలవర్షం  ప్రజలు .... నాడు 

వలస పాలకుల అభ్యాసములో 
కల్తీ చదువుల జ్ఞాన సంపదలో ... 
అయినా మారని నేటి పాలకులు 
యావంతా పచ్చకాగితాల పైననే  .... 

పాలకులంటే ప్రజాసేవకులని 
పుస్తక నిర్వచనాలు ప్రవచనాలు.... 
అధికారాపక్షమైతే హద్దులెరుగదు 
ప్రతిపక్షాలకైతే పట్టింపులు లేవు ..... 

సంక్షేమలంటూనే సంఘాన్ని 
చీల్చడం.... లాజిక్కులు లేని 
లా పాయింట్లు ముందుంచి 
కపట జిమ్మిక్కుల కళా ప్రదర్శనలు  ....  

ప్రజలలో చిచ్చు రగిల్చయినా 
పబ్బం గడుపుకోవాలనుకోవడమే 
పాలనలు గాలికి వదిలయినా 
ప్రతిపనిలో  క్విడ్ ప్రోకో  లేనాయే  ... 

ఆవగింజంత ఆదర్శభావమో 
నువ్వుగింజంత అంకిత భావమో 
కానరాక  ప్రజలంతా విస్తుపోతుంటే 
మేమేమి తక్కువ కాదంటూనే .... 

ప్రజల కళ్ళల్లో కారం కొట్టి 
కలిగించుకున్న దాంట్లో తృణమో 
పణమో కాసింత ఖర్చు చేస్తూ .... 
సొంత పూలవర్షాలకు కొంత ఊరటలు...   
చెందె నేటి నవ సమాజ నిర్మాతలు ..... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment