Monday, October 4, 2021

రామప్ప దేవాలయ ప్రాశస్త్యం--

 TSK సిద్దిపేట 

తేది: 01-08-2021
రామప్ప  దేవాలయ ప్రాశస్త్యం--
కాకతీయ శిల్ప సంపద 
*******************************
అపురూప శిల్పకళా వైభవం 
అద్భుతమైన రామప్ప దేవళం 
శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం
శిల్పి రామప్ప పేరున ప్రఖ్యాతం .... 
  
అందమంత రాశిపోషిన సాలభంజికలు 
అర్ధనిమీలితమైన ద్రుక్కోచరములు 
ఆర్ద్రత నిండిన పలకరింపులు 
పలికించని భావమంటూ...   లేదు 
పులకించని హృదయమంటూ.... లేదు ....  

ప్రకృతి వైపరీత్యాలకు సైతం
ప్రతిభావంతంగా నిలదొక్కుకునే 
సాండ్ బాక్స్ సాంకేతికతలు పొదువుకున్న 
సౌహార్ద్రపు సుసంపన్న పునాదులు...

కర్ర తొలిచిన తీరు కనువిందు చేసేను 
కృష్ణ శిలల పైన కుందనపు బొమ్మలు
మృదంగ వాద్యం ముదముగ మీటుచు
మనసులు దోచే మదనిక చిత్రములు ....

నాయక నాయకీమణుల పౌరుషాలు 
గాయక నర్తకీమణుల కళలకును 
ఘనమైన సత్కారాలనందించి 
పేరిణీ తాండవాన్నిపెన్నిధిగచేసికొనె .....

సూది మొనలు దూరేటి సుందరమైన 
సందులు.. అద్దమోలె  మెరిసి మురిసే 
కృష్ణ శిలల సాలభంజికలు .... మండప 
స్థంభాలు…వెలుగులీనే గర్భాలయం…… 

తెలుగు జాతికి తేరు పట్టి నిలిచిన 
తేట తెల్లము కాకతీయుల సొంతం.....
వెన్నయతో పయనమైన వంశం వెలిసె కదా 
కాకతి కరుణలతో తెలుగున వెలుగులు నింప....

రాళ్ళలో పూలు పూయించి రాగాలు 
పలికించిన శిల్పులు.. రంజిల్లే రమణీయ 
రంగమండపం…రంగులు వాడని వస్త్రంలా
నిత్య నూతనమై అద్దములా మెరియుచుండ...

ఆధ్యాత్మికతలకు ఆలంబనమైనా   
ప్రజలను  కీర్తించిన ఘనతలతో 
రామప్ప "ఏ సింఫనీ ఇన్ స్టోన్స్ "గా 
నాడే  కొనియాడబడే కోరి మన పి వి చే ... 

కీర్తి తోరణాలు కిసలయలై  తొణికిసలాడ
జాతి రత్నమై జగతి చరితన వెలిసె....
వేయి స్థంబాల వేలుపుల దీవెనలతో 
విశ్వ వారసత్వముగ  విరాజిల్లె నేడు 
విశిష్టతలను పొదువుకున్న వింత సౌధము.... 

నగునూరి రాజన్న
కరినగరము


No comments:

Post a Comment