Thursday, October 14, 2021

వరలక్ష్మీ వ్రతం తేది: 20-08-2021

 వరలక్ష్మీ వ్రతం 

తేది: 20-08-2021
శీర్షిక : సకలైశ్వర్య సౌభాగ్య పూజ 
కవిత సంఖ్య : 733

సర్వ లోక స్త్రీల సంక్షేమకారకమై 
సర్వేశ్వరుడైన శంకరున్ని  .... 
పార్వతీ దేవీ ప్రాధేయపడి 
వ్రతమేదైనా ఆనతీయమని కోరగా ... 

వరలక్ష్మీ వ్రతమాచరించిన 
స్త్రీలకు సకల సౌభాగ్యములు 
కలుగ జేయునని ....సవివరముగా .... 
సన్నుతించి బోధించెను .... 

మగధరాజ్య కుండిన నగరంలో 
చారుమతి అనే  సద్గుణ సంపన్నురాలైన 
సాద్వీ మణి  సద్గుణములకు మెచ్చి 
తనంత తానై ప్రత్యక్షమాయె లక్ష్మీదేవి ..... 

శ్రావణమాసం  రెండవ శుక్రవారం 
నవ సూత్ర తోరగ్రంథి ధరించి 
వరలక్ష్మీ వ్రతము ... ఆచరించమని 
ఆదేశించె స్వప్నమున ..... 

స్వప్న వృతాంతమంతయూ 
సవివరముగా తెల్సిన పట్టణ 
స్త్రీలంతా కలిసి ఆ ప్రత్యేక 
శుక్రవారం వ్రతమాచరించి
అమ్మవారిని కొలిచిరి .... 

లక్ష్మీమ్ క్షీరసముద్ర రాజా తనయాం 
శ్రీరంగ ధామేశ్వరీం .... 
దాసీభూత సమస్త దేవ వనితాం ... 
లోకైక దీపాంకురాం .... అంటూ స్తుతించిరి ... 

సకల సౌభగ్యాలను 
సిరిసంపదలనొందెను .. 
నేటికీ..... హైందవ స్త్రీలంతా 
మనసా వాచా పాటించేది ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment