రాతి జల
తేదీ : 30-07-2021శీర్షిక : జీవధార
కవిత సంఖ్య : 717
ప్రాణకోటికి పదిలమై నిలిచె
ఆది రెండవదిగా అత్యవసరాన
ప్రాణవాయువు తదుపరి తానై
జల తగరంగమై జాగృత పరచ...
మూడింట రెండొంతుల నిలిచి
పుష్కలమైన పుష్కరమే...అయినా
తాగలేము తానమాడలేము
భూమి పొరల్లోని జలధారలు తప్ప...
వాటంగా పారే వాగునీరు కన్నా
చెలిమెల నీరే తాగు క్షేమకారకం...
ఎడారిన వెలసిన ఒయాసిస్సులా
కొబ్బరిటెంకెలోని కొండ తీర్థంలా ….
రాయెంత గట్టిదైనా రాగాలు పలుకు
తీరు మనం మార్చుకుని దారికి తెస్తే
ఎంత గంభీరమైన మనిషికైనా
ఎన్నముద్దసొంటి మనసే కదా మానసం
సృశిస్తే లొంగని సృష్టి రహస్యముందా ….
అప్పుడప్పుడు లోతెంత తవ్వినా
లోగుట్టు పెరుమాళ్ళకెరుకలాగ
భూమి పొరల తీరువాటమో ఏమో
బండరాళ్ల మధ్య జలపాతలే జీవ ధారౌ
బహు చక్కగా మన్ని బాధలు తీర్చు
సాగునీటికైనా తాగునీటికైనా.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment