సృజన లోకం
తేదీ : 12-08-2021
శీర్షిక :
అపర బ్రాహ్మలు
కవిత సంఖ్య : 726
అభివృద్ధి పేరు చెప్పి చెప్పి
అతలాకుతలం చేసేశారు
మనిషి జీవితం ....మనిషి కన్ను
కప్పి
సాంకేతికత
మాయాలా
ఎదుగుతున్నది .......
నాలుగు గోడలమధ్య బందీలను
చేసి మనుషుల... మనసుల
మధ్యలో కూడా గోడలు పెట్టి
తమాషాలు చూస్తున్నది .....
పారిశ్రామికతలో ...సాంకేతికతలో
పరుగులు పెడ్తున్న మనిషి
పక్కవాణ్ణి కూడా పట్టించుకోవడం
ఎప్పుడో మానేశాడు .....
ఆత్మీయతలు ... అనురాగాలు ...
ప్రేమలు అనుబంధాల ముచ్చట్లు
ఒకటొకటిగా మాలలు కట్టి కూరుస్తూ
మళ్ళీ అక్షరాభ్యాసం చేయించాలి ....
మనిషిని మళ్ళీ పూర్వ స్థితికి
తెచ్చే.... కలం వీరులకో లేక
అరువది నాలుగు కళలలో
అనువైన విద్య కలిగిన
అపర బ్రహ్మలకే ఇప్పుడు
పట్టం కట్టేది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment