సజీవ ఆలంబన
తేది: 27-07-2021
శీర్షిక: ముందుతరాల కానుక
కవిత సంఖ్య : 715
మరకతమై శోభించిన
మహీతలం ఒకనాడు
మరుభూమిని తలపిస్తూ
మరకలతో ఎర్రబారి విర్ర
వీగుతున్నది ఈనాడు ....
స్వార్థాలను తలకెత్తుకున్న
అధికార బలగాలన్నీ జలగలై
పీల్చి పిప్పి చేసేస్తూ…అలసత్వాలు
ప్రదర్శిస్తూ విశ్రాంతిగా కునుకు తీస్తుంటే
పలహారాలై పోయి…కంట నీరే శరణ్యం ....
గ్రీష్మాలు భీష్మించి ఘీంకరించడమే
కాకుండా... ప్రాణ వాయువులు
జీవకోటిని పలకరించాలన్నా...
పచ్చందాలే పెట్టని కోటనే విషయాన్ని
మనమంతా గుర్తించాలి...
పచ్చని చెట్లే ప్రగతికి మెట్లో...
హరిత హారాలో...ఆభరణాలో…ఇంకేదో ....
పచ్చదనాలను పిచ్చిపిచ్చిగా
సజీవ ఆలంబన చేసుకుంటేనే
సగటు జీవికి సహారా అవుతుంది...
ముందు తరాలకు కానుకవుతుంది….
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment