Monday, October 4, 2021

చిత్ర కవిత - on the desire of sri M Rajeswara Rao

 చిత్ర కవిత 


స్థల మహిమో ... స్థాన మహిమో.... 
శాపమో .... శకునమో ..... 
పూర్వ జన్మ సుకృతమో .... 
పుణ్యాల తృణీకరణ తత్వమో ..... 

యుగాల నాటి  మాట .... 
గాంధారి పుట్టిన ప్రాంతం 
సాద్వీమణి  ద్రౌపదిని 
వివస్త్రను  చేసిన ఆనవాళ్లు ....
గీతాచార్యుడు ఆదుకున్న వైనం ....  నాడు 

అమ్మ చెల్లి  భార్య  కూతురు
అన్నీ అనుభవిస్తూనే  ఎదిగిన తరం 
ఆడదంటే అర్ధభాగం అని చెప్పినా 
ఆలకించని మొండి తనం. .... నేడు 

విశ్వంలో  మానవ డి ఎన్  ఏ 
అవశేషాలలాగే .... రాక్షస మూకల 
శేష భాగమో ..... దేవుని పేరు చెప్పి 
దెబ్బ తీస్తున్నారు .. టక టక కాల్చేస్తూ .... 

విజ్ఞుల మౌనం విశ్వానికే చేటు .... 
వింత ప్రవర్తనల నరరూప రాక్షసులు.... 
వందకు  రెండొందలకే అమ్మేస్తూ 
అమ్మ తనాన్ని అపహాస్యం చేస్తున్నారు. 

అంతట తానుండలేకనే  కద
ఆవరించె  అమ్మ లాగ ..... దైవం
ఆక్రోషించే  అమ్మ మనసు  శాపం.... 
అవదా..... మానవాళికి తీరని  మచ్చ .....

గీత బోధనలు చదివిన తరం 
రాత మార్చడంలో చూపదా చొరవ 
రావడం ఆలస్యమేమో కానీ 
రాకుండా మాత్రం ఉండడు 
దైవం మానుష రూపేణ ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment