Thursday, October 21, 2021

ప్రేమాలయం తేది: 01-09-2021 శీర్షిక : దేవాలయం

 ప్రేమాలయం 

తేది: 01-09-2021
శీర్షిక : దేవాలయం 
కవిత సంఖ్య: 44+1

అమ్మ నడయాడిన గుమ్మం 
నాన్న  మందలించిన ప్రదేశం 
నానమ్మను తాతాతయ్యను 
ఆదరించిన ఆత్మీయ బంధం ... 

తాతయ్య చేత రూపుదిద్దుకున్న 
తనువంతా తేనెలూరు దేవాలయం 
నానమ్మ చేత పూజలందుకొని 
వారసత్వంగా వాసికెక్కిన లోగిలి .... 

మేనత్తలు మేనువాల్చిన తల్పాలు 
మామయ్యలనాదరించిన మండువాలు 
బావలు వదినలు బహుగొప్పగా 
ఆడుకున్న పరిసరాల పదిలాలు ....

తోబుట్టువులతోడ ఆడుకున్న తోట 
బంగారు బాల్యాన్ని బహుమతించి
విద్యాబుద్దుల సరస్వతమ్మ కృపను 
కుమ్మరించిన విద్యాలయం అది ....

జీవన సహచరులను అందించి
మా కనుపాపల కళ్ళు తెరిపించి
మల్లెపూల సుగంధాలనద్దిన వనమది
మా మంచి జ్ఞాపకాల పోపుల పెట్టె….. 

స్వంత కాళ్ళమీద నిలబడి అక్కడక్కడ
ఎగురుతున్న పక్షులమైన మేమంతా
అమ్మా నాన్నల కనుసన్నల్లో మెదలాలని 
వారికి షష్టి పూర్తి మహోత్సవాన్ని చేసి…. 

ప్రతి మాఘ శుధ్ధ ఏకాదశికి కలియుగ
దైవమయిన రమాశ్రీ సత్యనారాయణ స్వామి
వ్రతంతో…. ఆ ఇంట ఎప్పడూ సంతోషాల 
వెలుగులతో సందడి చేస్తూ అమ్మ నాన్నలతో 
గడిపేవారం…. 
అదే మా ప్రేమాలయం….. 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment