సి నా రె గారి జయంతి 2021
తేది : 29-07-2021శీర్షిక : జ్ఞానపీఠ్ పురస్కార ఘనుడు ...
కవిత సంఖ్య :716
పల్లె తల్లి ఒడిలోన పారాడి
పసిడి పంటల పచ్చందనాలనద్దుకుని
సాహితీ పరిమళాలు వెదజల్లుతూ
విచ్చుకున్న సుమ సుందరం ....
తెలంగాణలో కళ్ళు తెరిచినా
అక్షరాస్యతలో తెలుగు అణగారినా
విద్యావిధానంలో వింత అంతరమున్నా
ఆది ప్రథముడై గెలిచి నిలిచాడు...
మాతృభూమిపై ఎనలేని మమకారంతో
గంగ యమున సరస్వతీ కృష్ణవేణి లకు
పితృ మానసమై ఉవ్వెత్తున హత్తుకున్న
జనకుడిగా దేశభక్తి తరంగాల హోరు ....
వైవిధ్య రచనల.. వాడి యైన కలం
అనేక భాషల ... అలవోక రచనలకు మూలం
వివిధ పదవులు ... వరించిన యోగం
ఒక్క మాటలో నిక్కచ్చిగా చెప్పాలంటే
లెక్కలేనన్ని సత్కారాల భాండాగారం ....
వెండి తెరల జాడల్లో .... దండి దొర
సగటు మనిషికి సజీవ చిత్రం కట్టిన
విశ్వంభర కావ్యాన్ని విరబూయించి
విశిష్టత చాటి విశ్వ విఖ్యాతుడాయె ...
జ్ఞాన పీఠ్ పురస్కారము ఘనముగ
పొందిన ఘనుడీతడు.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment