కార్గిల్
తేది 26:07:2021
శీర్షిక : మాతృభూమి
కవిత సంఖ్య: 714
నాది కానిది కోట్లయినా వద్దు
నాదన్నది రాయి రప్పయినా ముద్దు
కొండా కోనా... ఎండు పుల్లైనా మెండే
నా మాతృ దేశం నాకు గొప్పే ....
సుందర కాశ్మీరములో కలికి తురాయి
అందమైన భారతావనికి శిఖర సమం
అందులోనా హొయలుపోయే లోయలెన్నో
రక్షణలకు తోడయ్యే రమ్యమైన శిఖరాలెన్నో ....
హిమనగపు సానువులు ఇంపైన పూదోటలు
జలసిరుల సెలయేరులు కమనీయపు సొగసులు ....
మంచుపూల దుప్పట్లలో పరుచుకున్న పచ్చికలు
పల్లవించు హిమ నదములు పడమటి
సంధ్యా రాగములు పరవశించు గుండె లయలు ....
ఎత్తయిన సరస్సులు ఎనలేని అందాలు
జనరంజక నృత్యాలు జానపదుల జావళీలు ....
నింగినంటె నీలిసరస్సులు కలల ప్రపంచపు
కళా ఖండాలు… భారతమ్మ శిఖలో మల్లె మాలలు
భవ్య కాశ్మీరపు అందాలు .....
దాయాదుల పన్నాగం దమన నీతి దురాగతం
నమ్మకంగ నడుచుకుంటూనే నట్టేట ముంచే రకం
పొంచి చూచిరి అదను కోసం వంచన తత్వంతో
పోరాటం మెదలుపెట్టి పొందిరి ఆత్మానందం…
చావు దెబ్బ రుచి చూసి వెన్ను చూపి పారిపోయిరి….
ఇదేరోజు…. ఇరవై రెండు సంవత్సరాల క్రితం..
ఎనబది నాలుగు రోజుల నాటకానికి తెర
విజయ్ ఆపరేషన్ పేర విజయోత్సవం
జరుపుకున్నరోజు…వినీలాకాశంలో వింత మెరుపు
ఆసేతు హిమాచలం ఆనందించిన రోజు…
ఆనాటి అమర వీరులకు అచంచల జోహార్లు



నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment