Thursday, October 21, 2021

చిత్ర కవిత 03-09-2021 శీర్షిక : తల్లడిల్లిన తనయుడు

చిత్ర కవిత 

 03-09-2021

శీర్షిక : తల్లడిల్లిన తనయుడు 
కవిత సంఖ్య : 44+2

పాలనలెన్ని పాల ధారల భ్రమలు కార్చినా
పట్టించుకోరు పల్లె జనమును 
వాగ్దానములనెల్ల వడబోసినా 
ప్రోద్బలములీయని పాలకులే .... 

స్వార్థాల సంచులు నింపడమే కానీ 
సకల జనుల సంక్షేమాలన్నీ హుళక్కే ... 
తాగునీటికి ... సాగునీటికి ... కనీస 
సౌకర్యాలకు కూడా  నోచని పల్లెలే  ..... 

పిల్లల సవరించి...ఇల్లు చక్కబెట్ట 
సవ్యసాచులే  తల్లులు  ఎప్పుడూ 
తాగునీటికై బిందె నెత్తిన పెట్టుకుని 
తాను బయలుదేర…. చంకనెక్కె చిన్నది తగుదునమ్మాయంటూ .... 

ఇంతలోనే సంతలాగా...  కనికరము 
లేని కంట్లమొకటి గ్రుచ్చె కాలిలోన ....  
తల్లడిల్లిన తనయుడు తల్లి పాదమెత్తి 
ముల్లు తీయుచుండె కాలునుండి ...... 

ప్రజా పన్నుల పరవశించే పాలకులు 
పట్టీ పట్టని పాలనలను కొనసాగిస్తూ 
తూ  తూ  మంత్రాల ప్రణాళికలల్లుతూ
ఛీ ఛీ గుణశీలతలు పొదువుకుంటున్నారు … 


నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment