ఊపిరి ఉన్నంతవరకు
తేది : 03-8-2021
శీర్షిక : మాతృ .. భూమి ...
కవిత సంఖ్య : 718
పుట్టి బుద్దెరిగిన నాటి నుండి
పుణికి పుచ్చుకున్న సుద్ది బుద్దుల
సూత్రం ....
పుణ్య దంపతుల కడుపుల
పుట్టడమే నాకో గొప్ప వరం .....
పుట్టినా మళ్ళీ మళ్ళీ వారే
తల్లిదండ్రులు కావాలనే అభీష్టం ....
పల్లె తల్లి కనబరచిన ఆప్యాయం
పైర గాలి వినిపించిన సంగీతం
పడి లేచి పరుగులు తీసిన
సెలయేటి నీటి దాహల బంధం .....
మరు జన్మకైనా అదే నా ఆత్మబంధం ....
కళాశాల నుండి అడుగులు
కార్యక్షేత్రం వైపు కదలాగానే
వలస వాదులంతా కట్టగట్టి
ఒడుపుగా పారేసి ఓరకుంచిన
చరిత్రల పుటల చిగుళ్ల ఆనవాళ్లు
ఒక్కొక్కటిగా ఏరుకుంటున్న మల్లె మాలలు ...
పరాయి దేశాలను ఎప్పుడూ.. ఎన్నడూ ...
పల్లెత్తు మాటనని పల్లవింపులే ...
మాది కానిది కోట్లయినా సరే మాకొద్దు
మాదన్నది అణువంతయినా సరే
విడవొద్దన్న సూత్రం...
జన్మ జన్మలకు కావాలి ఈ దేశమే
నా స్థావరం...
ఊపిరున్నంత వరకు ఊదే మంత్రం....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment