ఛాయా చిత్రం
తేదీ : 19-08-2021
శీర్షిక : చారిత్రిక ఆనవాళ్లు
కవిత సంఖ్య : 732
తరాల కింద తండ్లాడి నేర్చుకున్న
హస్తకళ .... నాటి రోజుల్లో రాజులకో
జమీందారీలకో...ఉన్నోళ్లకు మాత్రమే ....
అందుబాటైన సరస్వతీ కళ ....
తరతరాల జీవనయానం మనిషిది
ఆనందాలు ... విషాదాలు ... ముల్లె
గట్టుకుని ... మనసున మురిసిన ...
ముసిరిన .... అడుగులకు నిడివి చిత్రం ...
మరుపు మానవ సహజమనే ఉవాచకు
తెర దించుతూ ... మానవ మేధకు
మెరుగులు దిద్దుకున్న సాంకేతికతల
సౌరభాలతో సంక్రమించుకున్న చిత్రకళ ....
నలుపు తెలుపులో.. రంగు హంగులో
కనుపాపలలో నిక్షిప్తం చేసుకునే బొమ్మ ....
మనస్సులో మనన నిమిషంలోనే
మదిలో మెదిలే ఆకారపు ఆనవాళ్లు ....
కలకాలం జ్ఞాపకం ఉంచుకునే రూపం
ఆత్మీయతలకు .... అనుబంధాలకు...
అనురాగాలకు ... మిత్రబంధాలకు...
అద్వితీయంగా అల్లుకున్న ఊసుల భావం ....
గుడ్డ కప్పుకుని గుప్పుమన్న దగ్గర నుండి
రక రకాల కెమెరాలెన్నో రాణించినా
అన్నీ మాయమై ... అరచేతిలో ఇమిడిన
చరవాణిలో సందు చేసుకున్నది ... ఈనాడు
సెల్ఫీల మోజులో యువత బేజారు ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment