లక్ష్యం
తేది : 12-08-2021
శీర్షిక : గమ్యం
కవిత సంఖ్య : 150
వద్దే వద్దు గమ్యం లేని పయనం
ప్రతి ప్రాణికి ఉంటుందొక గమ్యం
చిట్టి చీమకు సైతం ఉందొక గట్టి లక్ష్యం ...
కాలం మారినా కడుపు నింపుకునే ఆశయం...
విజ్ఞానవంతులమని విర్రవీగే మనకు
వివేకం వివేచనలే తోడు ఆయుధం ...
వినమ్రంగా తొంగి చూస్తే చిక్కుట ఖాయం....
విజయ తీరాలను చేరుట తథ్యం...
అత్యవసరాలు , అవసరాల బేరీజులతో
ఆనక కోరుకునే సంతోషాల అంతరాలలా
అన్నీ కలగలపక ఆలోచిస్తే తప్పక
అంతు పట్టదా తక్షణ కర్తవ్యం.....
పట్టింపులు లేని పాలకుల లాగా
ఎట్టి చాకిరీల ఎత్తిపోతల లాగా
భయం లేని బడా అధికారుల్లాగా
భక్తి లేని బంటుల్లాగా వద్దే వద్దు....
శ్రద్ధ లేని శ్రాద్ధం భూమికి భారం....
కర్మ భూమి మన దేశం నమోనమామి
కదలాలి గమ్యమెఱిగి మనమంతా క్రమశిక్షణల
కదం కలిపి బహుదూరపు బాటసారిగా... ఇక
కనకమై మెరవదా మన దేశ భవిత!
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment