గతాన్ని తరచి చూడు
తేది : 30-08-2021
శీర్షిక : అనుభవాల పెట్టె
కవిత సంఖ్య : 30+14
జీవితమంటే గెలుపోటముల
ఆటమైదానమే.....
జ్ఞాపకాల తుట్టె తేనెటీగల పెట్టె
అమ్మానాన్నల ఆత్మీయతల తరగలు
తోబుట్టువుల అనురాగ బంధాలు
మిత్రుల దండుతో పోరిన క్షణాలు
బాల్యములో అల్లుకున్న ముచ్చట్లు ...
ఎన్నెన్నో విజయాలను
మూటకట్టుకున్న ముచ్చట్లు
ఆనందాలను అక్కున
చేర్చుకుని సంతోషించిన
సందర్భం.....
నెమరు వేసుకున్న కొద్దీ
నెమలీకల అందాలే .....
అలనాటి అనుభవాలన్నీ
ఆనందాల పోపులపెట్టే ......
అప్పుడప్పుడు ఆవహించే
అలసత్వపు క్షణాల ఫలితాలో
నిర్ణయించుకున్న అంచనాలను
అందుకోలేని తారుమారులో .....
అనుభవాల పాటాలను
దివిటీలుగా మార్చుకుని
ధృడ సంకల్పాల గమ్యాల
గుమ్మపాలను నిర్దేశించుకుని ....
స్వంత బలాబలాలను
బేరీజు వేసుకుంటూ
గమ్మత్తైన గమన మార్గాలను
నిర్దేశించుకుని విజయాల
పూదోటలను వశ పరుచుకోవాలి ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment