నాగ పంచమి
తేదీ : 03-08-2021
శీర్షిక : సంతాన దేవత ...
కవిత సంఖ్య : 727
వేదాలు మర్మంగా ఘోషించినా
పురాణాలు విపులంగా ప్రవచించినా
ఇతిహాసాలు వివరంగా ఎరుకపరిచినా
పంచభూతాలను పట్టినా ముట్టినా
ప్రపంచానికే మార్గదర్శనమౌతున్న
ఘనమైన మన హైందవాన
పబ్బతే సుమా ....
చెట్టు పుట్ట కొండా కోనా నది
సముద్రము .... ఆవు కుక్క మేక
మొదలైన పశు పక్ష్యాదులు
అలాగే విషతుల్యమైన నాగు పాములలో
దైవాన్ని దర్శిస్తాం... కావున పూజనీయమే .......
అనంత శయనునికి ఆదిశేషువే
పానుపవ్వగా... బోళాశంకరునికి
మేడలో ఆభరణమై .... వినాయకునికేమో
యజ్ఞోపవీతమై .... మొత్తంగా
సుబ్రహ్మణ్యునికి ప్రతిరూపమై
సంతాన దేవతగా సర్వత్రా
పూజలందుకొనుచుండె.....
రైతన్నలకు రక్షలనివ్వాలని
పాడి పంటలకు అండదండవ్వాలని
చేను చిలక తిరిగే వ్యవసాయదారుల
రక్షించాలని .... మహిళలంతా కూడి
మహిమాన్వితమైన నాగేంద్రునికి
నాగపంచమికి ... నాగుల చవితికి
పుట్టల వద్ద పూజలు చేసి వేడుకొందురు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment