Thursday, October 14, 2021

ప్రణయ గీతాలు తేది: 07-08-2021

 ప్రణయ గీతాలు 

తేది: 07-08-2021
శీర్షిక: ఊహల సుందరీ…. 
కవిత సంఖ్య: 722

చెలీ ఓహో…. నా… చెలీ 
మనసు ఊహల సుందరీ…. 
అల్లనల్లన కదిలె ఓ చల్లగాలి 
ఆనవాలు సెప్పవే నా చెలిది

అలిగి పోయిన నా చెలి
అడుగుజాడలు తెలిపి నీవు
ఆనతీయవే చక్కిలిగిలికి 
అంతరంగమున మధురముగా 

కొండ వాలున నిలిచిందా
కొంటె చూపులే విసిరిందా
కనులు… మూసినా…తన రూపమే
కంట…. నిలిచినే…ఆనందం…. //చెలీ//

మెరుపు తీగలా మెరిసిందా
మేని ముసుగులా నవ్విందా
రావా….….నను ….కరుణించి
రావా…. ….నను….వరియించి….. //చెలీ//

సన్నగ వీచే పైరగాలిలో
సంపెంగ ముచ్చట నీవైపోయి
భావన…. ఏదో… తెలపాలి
భారం…. నీవే….. కావాలి…. //చెలీ//


నగునూరి రాజన్న 
కరినగరము.  

No comments:

Post a Comment