Monday, October 4, 2021

శ్రావణ శోభ తేది : 09-08-2021 శీర్షిక : శుభాల మాసం

 శ్రావణ శోభ 

తేది : 09-08-2021
శీర్షిక : శుభాల మాసం 
కవిత సంఖ్య : 723

శశిని చేరిన శ్రవణం 
శ్రావణమై వర్దిల్లె శ్రావ్యంగా 
తొలకరి చిలకరింపుల 
పులకించిన ధరణీ మాత ... 

పచ్చ కొక చుట్టుకున్న 
పడుచు ముతైదువలా మారి 
అమ్మలక్కలను అక్కున చేర్చుకుని 
వరలక్ష్మీ వ్రతాలటంచు 
వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు  ... 

అమ్మ వారి దీవెనలందుకోవాలంటూ  
గౌరీ వ్రతలనాచరింప జేసి 
ఉత్సవాల మాసంగా
శుభాలనందిస్తుంది .... 

తోబుట్టువుల ఆత్మీయతలకు 
తోడు నిలిచే  రక్షా బంధనాలు .... 
అల్లరి గోపాల కృష్ణుని 
ఆటపాటల గుర్తుగా కృష్ణాష్టమీ 
పండగలు .... 

ఆషాడ ముసుర్లకు అల్లుకున్న 
సూక్ష్మ జీవుల బెడద నివారణకు 
శుచి శుభ్రతలకు పెద్దపీట వేసి
నదీ స్నానాలకు తరలి వెళ్లి 
వన భోజనాలకు వంత పాడెదరు .... 

సంతానార్ధులంతా సాగిలపడి 
మొక్కెదరు... పాలు పాండ్లు 
సమర్పించి పాముల పుట్టకు 
పట్టం కట్టే నాగ పంచమి ఈ మాసమే.... 

దాస్య శృంఖలాలను 
దండిగా ఎదిరించి పోరి 
స్వాతంత్ర్యాలను సముపార్జించిన 
పండగతో ... శ్రావణమంటేనే 
శుభాల మాసం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment