Thursday, October 14, 2021

చిత్ర కవిత తేదీ : 21-08-2021 శీర్షిక : చంద్రవదన

 చిత్ర కవిత

తేదీ : 21-08-2021
శీర్షిక : చంద్రవదన  
కవిత సంఖ్య : 30+10

సకల స్త్రీల సంక్షేమకారిని 
అమ్మ  జగజ్జననే  పూనుకుని 
శివయ్యను ప్రాధేయపూర్వకంగా  
ఆనతీయమనే అనువైన పూజ .... 

శ్రీ పీఠే సుర పూజితే 
పద్మ హస్తే జగద్ధాత్రి 
పావన రూపే మాతా 
పాహిమాం పాహిమాం .... 

పద్మాసన స్థితే దేవి 
చతుర్  హస్త దేవి 
పరబ్రహ్మ స్వరూపిణి 
పరమేశి జగన్మాత://

విష్ణోరురసి స్థితాయై 
లక్ష్మీ కమలాలయాయై 
త్రిభువన భూతికరి  
దామోదరవల్లభాయై //

అష్ట లక్ష్ములుగా కొలువై 
అభయాలనొసగే  తల్లీ 
అనువైన రీతిలో భక్తుల 
బ్రోచే  సంపదల  కల్పవల్లీ .... 

వరలక్ష్మిగా వాసికెక్కె 
శ్రావణ రెండవ శుక్రవారం 
వరములనిచ్చి బ్రోచే 
వాసిగా చారుమతికి ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment