లలిత గేయాలు
తేది: 28-08-2021
శీర్షిక : గంగమ్మ తల్లి ….
కవిత సంఖ్య: 740
అందమైన భారతికి
మందారమే గంగమ్మ
విందామా మనమంతా
మనసుపెట్టి పయనాన్ని ....
చిన్నాపెద్ద ఉపనదులు
చిందులేసి పయనించి
చిత్రంగా కలుసుకుని
గంగమ్మగా రూపమెత్తె ...
భాగీరథి బయలెల్లే
గంగోత్రిలో పయనమయ్యి
అలకనంద కలుపుకుని
గంగమ్మగ మారిపాయె ...... . //అంద//
పిండారి మందాకినీ
పిలుపులతో పలికెనే
ఒళ్ళంతా పులకరించు
గంగమ్మను తలవగనే
చంబల్ బెత్వాలను
చేరదీసి యమునమ్మ
చేరి కలిసె గంగమ్మను
చెలిమితోడ ప్రయాగలో ..... . //అంద//
ఎన్నెన్నో రాష్ట్రాలను
చుట్టుకున్న గంగమ్మ
సాగునీరు తాగునీరు
సకలమంతా తానేగా ...
వారణాసి చుట్టుముట్టి
పాట్నాగుండ పరుగెత్తి
ఫరక్కాను సృశించి
బంగాలును దాటేసి.... .. //అంద//
సన్నుతించి కనికరించి
సముద్రాన కల్సిపోయే ....
విందామా మనమంతా
మనసుపెట్టి పయనాన్ని .... //అంద//
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment