ఆలోచన
తేది: 09-08-2021
శీర్షిక: సుందరమైన జీవనజ్యోతి
కవిత సంఖ్య : 148
పదోవంతు వాడటమే
ఆనవాయితీ అయిన
మస్తిష్క మధన సుధలలో
మరో అడుగు ముందుకేసి
మరొకవంతును అదనంగా
వాడగలిగితే మహద్భాగ్యమే ...
నిన్నటిని మదించుకుని…
విషయాలను సమీక్షించుకుని
జరుగుతున్న వాటిలో మార్పులో చేర్పులో
చేసుకుంటూ ... ముందు ముందటి
విషయాలకై మెరుగైన ప్రణాళికలు
రచించుకుంటూ... ఎప్పటికప్పుడు
సాన పెట్టుకోవడానికై... మనసును
కేంద్రీకరించుకోవడమే ....
బ్రతుకు బాటలో మోగించే
సరిగమ పదనిసల రాగాలు
రక్తికట్టి రంజుగా ఆలాపన
చేయాలంటే పూర్వాభ్యాసాల
పుణ్య కార్య క్రమాలు చేస్తూ ...
ఆలోచనల తైలమేసుకుంటూ
జీవనజ్యోతిని సవరిస్తూ వెళ్ళాలి....
నగునూరి రాజన్న
09-08-2021.
No comments:
Post a Comment