Thursday, October 14, 2021

నింగి - నేల తేది : 23-08-2021

 నింగి - నేల  

తేది : 23-08-2021
శీర్షిక : కలవని బంధువు 
కవిత సంఖ్య : 30+11

అల్లంత దూరాన అలుముకున్న 
ఆగమ్య గోచరమైన అంబరం 
అంటిపెట్టుకున్నది గొడుగై 
అవని తల్లి పైన జీవ ఉనికికి 
ఆధారభూతమై ..... 

నీలాంబరిగా నిత్య దృశ్యమై 
శశి భానుల రష్మిలను ప్రసరిస్తూ 
జీవకోటి జవనాడులకు ప్రాణం 
పోస్తూ ... ఫరిడవిల్లవింపజేస్తూ
అనుసంధానతను నిలబెడుతుంది .... 

పుష్కలమైన నక్షత్ర పూలకు 
పురిటిగడ్డయి.. నిలువెత్తు విజ్ఞానాలకు ...
నిష్కల్మష వినోదాలకు.... 
నిలువుటద్దమై ప్రతిబింబిస్తుంది 

గ్రీష్మ తాపాలను భీష్మంగా 
ప్రసరింప జెసి .... 
సంద్రముల నీరంతా తాను 
తస్కరించి ... 
అవనిపైన చినుకు పూలవాన 
కురిపించి ..... 
పచ్చ తివాచీలు పరుస్తుంది ..... 

తొలకరిలో రేగిన మట్టి వాసనలను....  
భూసురమైన వసంతాలలో 
కుసుమ కోమలమైన ....భూదేవి శోభలను 
కనులారా వీక్షిస్తూ..... తనువారా 
సంబరమే ... అంబరానికి ..... 

నిత్యం కలుసుకోక పోయినా 
సత్యంగా కను దృష్టి నుండి తప్పుకోక .... 
అలసటలు నీరసాలు  మరిచి 
అవినాభావ సంబంధమై అల్లుకున్న 
కలుసుకోని  బంధువు ....  

 నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment