Monday, October 4, 2021

చెప్పాలని ఉంది తేది: 05-08-2021

 చెప్పాలని ఉంది 

 తేది: 05-08-2021
శీర్షిక: ప్రజా వాణిగా …. 
కవిత సంఖ్య: 42

వారసత్వ సంపదల వాసి గలిగిన.. 
సర్వ సాంప్రదాయాల పరిమళ సరంగు 
మన దేశ ఔన్నత్యాల మూటనే.. మాట 
అందరికి విడమరచాలనుంది.... 

పాలనలకోసం పాకులాడే పాకుడురాళ్లకు... 
పొరుగు సరిహద్దుల్లో నిలిచి పోరే
దేశభక్తి పరిమళాలు వెదజల్లే అనుభవాల 
అంగీలు తొడుక్కోమని..చెప్పాలని ఉన్నది.... 

అధికారాల అర్రల్లో కూర్చోగానే.. అన్నీ  
మరచిన ఆంబొతులై ... ప్రజా రక్తపు 
చెమటల్లో తడిసి ముద్దయిన రంగు 
కాగితాలకోసo...కుప్ప మీద తెప్పలాటలా
బల్ల కింద చేతులు చాపే జూదాలు ఆడుతూ ... 
సామాన్య ప్రజలను బలిపశువులను చేస్తున్న 
బలిసిన గణాలకు... చెప్పాలనుంది... 

స్వార్థ భుజకీర్తులను తగిలించుకున్న 
నేటితరం కార్పొరేట్లకు కనువిప్పులు 
కలిగించే  తరగతులు నిర్వహించి  
మానవతలద్దిన మనోవికాస విషయాలు 
వివరంగ విడమరచాలని ఉంది….

అనుభవాల వత్సరాలు గడిస్తున్నా
అనువైన మార్పులకు శ్రీకారం చుట్టని 
మజ్జిగ పాలకులకు పట్టిన శని వదిలించ 
ప్రజావాణిగా ప్రతీది చెప్పాలనుంది... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment