చిత్రకవిత
తేది: 23-07-2021
శీర్షిక: నంద కిషోరా …
కవిత సంఖ్య: 40
దేవకీ వసుదేవుల తనయా
నంద యశోదమ్మల కిషోరా
కట్టిపెట్టవా కాసేపు కనులు మూసిన
నీ కణికట్టు నాటకాల కునుకులాట…
పాలు పెరుగులు వెన్నలన్నీ
ఫలహారంగా చేసేసి… పట్టనట్టు
పాత్రలపైనే పడకేసిన కన్నయ్యా...
ఎక్కడయ్యా నీ మిత్ర బృందమంతా?
కంస సహారా కారణ జన్మా
కాళింది పడగపై నాట్యమాడి
కరుణించిన గోవర్ధన గిరిదారి
గోపాల బాల గోకులనందనా...
చిలిపి చేష్టల చిన్నారి కిట్టయ్యా
చిన్నబోవా గోపమ్మల ఇళ్లన్నీ
తల్లడిల్లదా తల్లి మనసు
నీ జాడలు కానరాక యశోదమ్మకు ...
రాధమ్మను మురిపించే
రమణీయమైన మురళీ రవం
అల్లన మోగే పిల్లన గ్రోవిని
పక్కనపెట్టి పగటి విశ్రాంతియా…
బలరామానుజా గోవిందా
భాగవత ప్రియా గోవిందా
నీతి తెలిపే మార్గమా మాకు
గీత బోధనల సారమా ఇది…..
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment