నేను కాని నేను
శీర్షిక: సీతాకోక చిలుక
తేది: 28-07-2021
కవిత సంఖ్య :
అరువది నాలుగు లక్షల జీవకణాల్లో
ఆధారపు పందిరి అందుకుని అల్లుకుని
అమ్మ గర్భపు పూదోటలో నిలువగలిగే
అదృష్టం దొరికి… అనుపానుల ఉనికి
నిలుపుకో గలిగిందంటే ఆశ్చర్యమే .....
నేనుకు మూలం .....
పరిమిత నియమిత సమయాలలో
పట్టు దొరకబుచ్చుకోగలిగితేనే
రూపం లేని కణం..ఆకార రూపం
చెక్కుకుని బయటికి ప్రాణంతో వచ్చేది...
అదే నేనుకు రూపం....
కరుకు దేహం పెరిగి తరువోలె పెద్దదయి
అందమైన ఆకారం రూపు దిద్దుకోగానే
మొహం పెరిగి స్వార్థం కలిగి.. లోపలున్న
సున్నిత మనస్కున్ని తిరస్కరిస్తుంటాము
అంతా నేనే అంటాం...
దేహం నాదేనన్న భ్రమలో నేనుంటే...
ఎదురుగా జరుగుతున్న అన్యాయాలను
తప్పని చెబుదామంటే.... మాట వినదు…
కళ్ళ ముందే జరిగే ఘోరాలను
కదిలి ఆపుదామంటే ... మౌనం వీడదు...
రూపాంతరం చెందుతూనే….
ముడుతలు పడి పోతుంది .....
వేగం తగ్గుతుంది... చివరకు
తానొక సీతాకోక చిలుకై ఎగిరి...
నేను కాని నేనంటూ తాను
వదిలి వెలుతుంది…..
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment