Monday, October 4, 2021

ఉన్న ఊరు కన్నతల్లి తేది: 05-08-2021 శీర్షిక: నెయ్యి భోజనమే…

 ఉన్న ఊరు కన్నతల్లి 

తేది: 05-08-2021
శీర్షిక: నెయ్యి భోజనమే… 
కవిత సంఖ్య: 720

పుట్టినూరు ముచ్చట్లంటే…తనువంతా
పురి విప్పి నాట్యమాడే మయూరమే… 
అమ్మ పాలిచ్చి పోషణలిస్తే
ఊరు…గాలి నీరు ఇచ్చింది… 

పాల బుగ్గల బాల్యమోలె
పాణమిచ్చి నిలిపిన కల్పవల్లీ
పసిమి వన్నెల యవనమోలె
మనసంతా సప్తవర్ణములే….. 

దర్వాజ దాటి దాటంగానే
వావి వరుసల బంధుత్వాలే 
కాలికి చిన్న పొట్రాయి తాకినా 
కంట నీరు పెట్టనీయని వైనాలే…

పనులల్లో పక్కోళ్లు ఆసరౌతూ 
ఊరుమ్మడి బతుకుల బంధాలే 
కుంటి సాకులెరుగని అమాయకత్వం   
కుల మతాలకు ఆవలి తీరం ..... 

ఉన్న ఊరు బంధాల ముచ్చట్లన్నా 
ఊపిరి బిగపట్టుకొని చెవికోసుకొనుడే 
కన్నతల్లి ఆత్మీయతలు నిండిన కబుర్లన్నా 
కలకాలం కమ్మని నెయ్యి భోజనాలే ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment