చిత్ర కవిత ( ఆవు )
తేది : 13-08-2021
శీర్షిక : కరుణా మూర్తి. .....
కవిత సంఖ్య : 30+6
వేల సంవత్సరాలనాడే వేనోళ్ళ
పొగడబడి వేదాలలో పొందుపరిచె ... .
వెన్న దొంగ కన్నయ్య మన కృష్ణయ్య
సేవించుకుని మురిసె ముచ్చటగా .....
సకల దేవతలకు ప్రతినిధియై
చరాచర విశ్వాన్ని తనలో
ఇముడ్చుకున్న సర్వసంపదల
పవిత్ర సన్నిధానం మన గోమాత....
యుగాల క్రితమే
జగాన మనము
అపర మాతగా గుర్తించి ఆధ్యాత్మికత
ప్రాధాన్యత జోడించి పవిత్రంగా
పూజించిన సంస్కృతి సంప్రదాయం ....
వ్యవసాయాధారిత దేశానికి
వంశ పారంపర్యంగా సేవలు
చేస్తూ అడుగడుగున రైతన్నకు
అందండలు అందిస్తూ అన్నపూర్ణగా
తీర్చి దిద్దినది .....
పిల్లలకు తల్లిలా పాలు అందజేసి
ఎవుసం పనులకై రైతులకు తన
పిల్లలనందజేసి... పంచకంలో
ఔషధాలను అందిస్తూ అహర్నిశలు
మానవాళిని కనిపెట్టుకున్న కరుణా మూర్తి. .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment