Monday, October 4, 2021

గరుడ పంచమి తేది : 13-08-2021 శీర్షిక : అమృత మూర్తి

 గరుడ పంచమి 

తేది : 13-08-2021
శీర్షిక : అమృత మూర్తి 
కవిత సంఖ్య : 151

సనాతన సాంప్రదాయాలో 
సంస్కృతి వారసత్వాలో 
ఆచార వ్యవహారాల బలమో 
చెట్టుకూ ... పుట్టకూ మొక్కడమే 
ఘనమైన మన హైందవం ..... 

లక్షల ఏండ్లనాడే లక్షణంగా 
అక్షరీకరించారు ఆర్యులు 
మన వేదాలలో ... పురాణాలలో ... 
ఇతిహాసాలలో ... అనుభవాలను.... 

గౌరీపూజలు ఘనముగ చేసి 
సంతానార్ధులంతా సాగిలపడి 
మొక్కెదరు నాగ దేవతలకు ... 

వినత సంతానమై ఉద్భవించిన 
విఖ్యాతుడు గరుడుడు పుట్టిన రోజే 
గరుడ పంచమిగా ప్రసిద్ధికెక్కె .... 

ఇంద్రున్నెదిరించి అమృతం 
సాధించి అమ్మను రక్షించిన 
అమోఘమైన అమృత మూర్తి 
గరుత్మంతుడు... 
 
అంతటి  పరాక్రమవంతులు 
ఆత్మీయతలు కలిగిన అమృత మూర్తి 
సలక్షణమైన  సంతానాలకై 
అర్చించెదరు ఈ పంచమి రోజున ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment