Thursday, October 14, 2021

తామరాకుపై తేదీ : 24-08-2021 శీర్షిక : నీటి బొట్టు వంటిది ....

 తామరాకుపై

తేదీ : 24-08-2021
శీర్షిక : నీటి బొట్టు వంటిది .... 
కవిత సంఖ్య : 736

ఆల్చిప్పలో పడితే అదృష్టమే 
స్వాతి ముత్యమై సంతసించవచ్చు .... 
తామరాకు మీద పడితేనే ...తండ్లాటా 
మరోనిమిషం... ఏంజరుగుతుందో ... 

తాను పడిపోతానని  తెల్సినా 
ఉన్న ఒక్కక్షణం తళుక్కున 
మెరిసి ... కాంతులీనుతూ .... 
మనుషులకు మరుపునిస్తుంది 
మనసులను మురిపించి రంజింప 
జేస్తుంది ..... 

సప్తవర్ణాల శింగిడిలో మునిగి 
తేలే లోపే జీవిత ప్రపంచాలు 
అంతమౌతుంటే .... ఎందుకో 
మనిషి మార్చుకోలేక సతమత 
మౌతూ కొట్టుమిట్టాడుతున్నాడు .... 

కలల ప్రపంచంలోనే కదలాడుతూ 
కలి మాయల నీడలలోనే 
బాధ్యతల ముసుగులేసుకుని 
బంధాల చట్రములో నిలిచి 
"నేను" అనుకుంటూ సాగుతున్నాడు 

విజ్ఞాన వివేచనలు తోడు చేసుకోని 
గతించిన చరితల గమనాలను 
పరిశీలించి ... గమనం దిద్దుకొని 
గమ్యం నిర్దేశించుకుంటే సుఖాంతమే  ..... 
 కదా .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment