ఉపాధ్యాయుడు
తేదీ : 05-09-2021
శీర్షిక : ఊరు మేలు కోరువారు
కవిత సంఖ్య : 161
ఊరు మేలు సదా కోరువారు
ఉపాధ్యాయులై జన్మించారు ....
ఉడతాభక్తిగ వేతనాలిచ్చినా
ఉన్నతమైన శిల్పంగా తీర్చి దిద్దు
శిష్యులను ఉన్నంతలో.....
బీటలు వారిన మేధస్సులోనైనా
ఊపిరంతా బిగపట్టుకుని
వర్ణమాలను పదే పదే ఉచ్చరింప జేసి
బీజఅంకురాలను నాటే వనమాలి ....
అమ్మలోని ఆత్మీయతలు
నాన్నలోని బాధ్యతలు
కలగలిసిన శిల్పమే
పిల్ల మొక్కలను తీర్చిదిద్దంగా ....
వ్యవస్థలోని అవస్థలను
మటు మాయం చేయగల
సామాజిక వైద్యుడు
కత్తి పట్టకుండానే యుద్ధం
చేసి గెలవగల ధీరుడు .....
పరికించు పురాణాలు
పట్టమే ఎపుడు గురువులకు
దేశ పాలకుడైనా... ఓ గురువుకు
శిష్యుడే ....పాలకులు గురువుల
గౌరవిస్తే ... పండుతుంది
సమాజమంతా సస్యశ్యామలమై .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment