ముస్తాబుల పల్లకీ
తేది : 16-08-2021
శీర్షిక : స్వతంత్య్ర భారతం ....
కవిత సంఖ్య : 152
వలసవాదుల కఠిన దాస్య
శృంఖలాలను... వరస పెట్టి
ఎదిరించి అలుపెరుగక పోరాడిన
స్వాతంత్య్ర పోరాట అమర వీరులకు .....
ఆత్మీయ నమస్కారం
వందలేండ్ల పోరాటములు ...
వేల మంది బలిదానాలు ....
బలిపీఠాలను ముద్దాడిన
భగత్ సింగ్ లాంటి వారు ....
ఎందరెందరో కలిస్తినే ....ఎరుకగా
మన స్వతంత్య్ర భారతమ్మను
సన్నుతంగ సవరించి అధిరోహింప
చేసిరి .... ముస్తాబుల పల్లకీలో .....
కోరుకున్న ప్రజా స్వాతంత్య్రం
కొంతమంది చేతుల్లోనే ....
కొలిమి లోని కర్రులా కాలి
కోరి ప్రజలకు వాతలు పెడుతుంటే ......
సంబర పడుతుందా... బాపూజీ గుండె ...
సంతసిస్తుందా... సుభాష్ మనసు
పరవశిస్తుందా ....
పటేలు హృదయం
...
ఓలలాడుతుందా ... అల్లూరి శ్వాస
తీరుతుందా .... తిలక్ గారి అలక ....
ఓ మనిషి ఆలోచించు
ఓటు వేసే ప్రతీసారి
ఎందరో మహానుభావులు
అందరికీ వందనాలు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment