మళ్ళీ బడికి
తేది:01-09-2021
శీర్షిక: ప్రత్యక్ష తరగతులు
కవిత సంఖ్య: 743
కంటికి కనపడని కపట క్రిమి ఏడాది నుండి
కబాడీ ఆడుకుంటున్నది జీవితాలతో
కడుపు తీపికో… కట్టుబాట్ల తోడనో….
కట్టిపడేసాయి చదువులు.. ఆటలు ....
నియమాల తోరణాలతోనో లేక
టీకాలతోనో కొంత సేద దీరినామనిపించి..
ఒకటొకటిగా తెరుచుకొని ఓదార్చుతున్నాయి
ఇప్పుడిక బడి పిల్లల వంతు వచ్చింది ....
ఇన్నాళ్ళు సంధికాలపు సాంకేతికతల
సౌలభ్యాలను అందిపుచ్చుకుని కొంత మేర
చరవాణి తెరల మమ అనిపినిస్తున్నా
సాంతంగా సాకారమనిపించడంలేదు...
ప్రభుత్వాలు పచ్చజండా ఊపగానే
మూలపడిన పుస్తకాలన్నీ ముస్తాబు
అవుతున్నయి…యూనిఫారాలన్నీ
ఉతికి ఆరేసుకుని ఇస్త్రీల మడతల్లో
మెరిసి మురిసి పోతున్నాయి ....
ఎన్నో రోజులనుండీ ఆశగా ఎదురుచూస్తున్న
పంతుళ్ళకు ఎంచక్కా పిల్ల చిలకలతో
ఎదురుపడే ప్రత్యక్ష తరగతుల శుభసూచకం…
మానవీయతలకు వేదికయ్యే మరోకోణం…
ఎదురుచూస్తున్నాయి తరగతి తరువులన్నీ
బిల బిల వాలిపోయే చిలుకల కొరకై…
ఉవ్విల్లూరుతున్నాయి నల్లబల్లలు
జ్ఞాన బోధలకై సమాయత్తమౌతూ…..
బాధాతప్త భయకంపిత హృదయాలతో
పిల్లల్ని పంపుతున్న తల్లిదండ్రులకు
ప్రభుత్వాలు పంతుళ్లే ఇక భరోసాలు నింపాలి
ప్రత్యేక పారిశుధ్య చర్యలతో సరైన పెస్టిసైడ్లతో ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment