Monday, October 4, 2021

పదాల కవిత తేదీ : 17-08-2021 శీర్షిక : ఉదయతపూర్వపు సంధ్య

 తూర్పు , గాలి, ఆమని , సంధ్య , 

వయ్యారం , వేకువ .... 

అంశం: పదాల కవిత 
తేదీ : 17-08-2021
శీర్షిక : ఉదయతపూర్వపు సంధ్య 
కవిత సంఖ్య : 153

వర్షఋతువేతెంచి....  శ్రావణ 
మేఘాలతో కమ్ముకున్న చీకట్ల 
తలుపులు తెరుచుకుని తూర్పు 
దిక్కున తొంగి చూడబోయే భానుని 
కొరకై .... 

తరువులనావరించిన ఆమని 
పైర గాలి వయ్యారాలు పోతుంటే....   
శుక పికములు ఆలపించే భూపాల 
రాగములు ఆనందాల ఆహ్వానాలు 
పంపు ..... 

వేకువనే గగనంలో విచ్చుకున్న  
కెంజాయ వర్ణం మిళితమైన మేఘాలేమో  
వరుణుని ఆజ్ఞకై వేచి చూస్తున్న 
జలతారు కన్యల్లా గోచరించ ..... 

తొలకరి వానల పలకరింపులతో 
పచ్చ కొక చుట్టుకున్న అవని మాత 
పసక పరిమళాలను వెదజల్లుతూ 
ఉదయాతఁపూర్వపు  సంధ్య కాంతులకై   
దినకరునికై ఆహ్వానములనే పంపింది ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment