అంతర్లోచనాలు
తేది : 04-08-2021
శీర్షిక : కనులు మూసినా తెరచినా
కవిత సంఖ్య : 719.
వందనాలో వందనాలు
వందనాలో లింగమయ్యా
వందనాలో జంగమయ్యా
జగములేలే జంగమయ్యా...
జగజ్జనని సూచనలా
అర్థనిమీలితముల నిద్రలా
జగములనేలుతున్న తపనలా
దారి తెన్నూ లేనివారికి దీవెనలా ....
బోళా శంకరుడివన్న భావనలా
లయకారుడివన్న రూఢీలా
తెలిసీ తెలియక చేసిన పాపముల
తేట తెల్లముగా కడిగి తేలిక చేసే గంగాపతి
కైమోడ్పుల వందనముల నందుకుని
మమ్ము కరుణించుమో… కైలాసపతీ .....
లింగ రూపమున ఏలుకునే
వెండి కొండల దండి దొరవని
నిండు మనసున మమ్మెపుడూ
కాచి మమ్ము కాపాడమని మొక్కెద ....
కనులు మూసినా తెరిచినా
కనిపెట్టుకోవడమే తెలిసిన
కలియుగములనేలే ఆలోచనలే కద
ఫాలలోచనా పావన మూర్తీ…..
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment