పోగొట్టుకున్న చోటే…
తేది: 06-09-2021
శీర్షిక : అనుభవాల పందిరి .
కవిత సంఖ్య : 747
అనుభవాల తోటలో అమిరిన
ఉవాచలు అన్ని చోట్ల సాధ్య
పడకపోయినా ...
విలువైనవైతే
వివేకాల తోడునీడలతో వీలయినన్ని
సాధించుకోవచ్చు .....
కనుమరుగైన అమ్మానాన్నల
కమ్మని ప్రేమలు కనుగొనలేక
పోయినా.... అమృతాలు కురిపించే
అడుగంటిన మానవ సంబంధాలకు
అత్తరు సుగంధాల పరిమళాల నద్ది
వికసింపచేసుకోవచ్చు .....
వారా ... నేనా .....సంశయాలు వీడి
ఒక్క అడుగుతో మొదలెట్టి... వేల
మైళ్ళ విజయాలను శాశించవచ్చు ....
కోట్ల బంధాల పరిమళాలను శ్వాశించవచ్చు .....
పోగుట్టుకున్న సంపదల
విషయంలో ... పొరపాట్ల పొట్లము
విప్పుకుని విశ్లేషించుకుని....
పొల్లుపోని జాగ్రత్తలన్నీ మూట
గట్టుకుని అడుగులేస్తే ......
ఆరితేర దీసిన అనుభవాల
పనిముట్లను ఆసరాగా చేసుకుని
నిత్య జీవన స్రవంతిలో
ఒక్కోక్క మెట్టు ఎక్కగలం ....
ఒదిగి ఎదగి నిరూపించగలం ....
సాధించడం అన్నీ సాధ్యం
కాకపోయినా .... అదేచోట అన్నీ
వెతకలేక పోయినా .... అనుభవాల
పందిరి మాత్రం బతుకు ఆసరా
అవుతుంది .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment