AZADI
భారతీయ సాంస్కృతిక వారసత్వం
శీర్షిక : అపురూప శిల్పకళా వైభవం
మన రామప్ప ప్రాభవం……
భిన్నత్వంలో ఏకత్వంలా వైవిధ్యాల హరివిల్లు
వివిధ భాషల మతాల వివిధ ఆచారాల
వివిధ సంస్కృతుల వివిధ కళల మేళవింపే
భారతీయ సాంస్కృతిక వారసత్వమనంతం……
ఆసేతు హిమాచలం నుండి కన్యాకుమారి వరకు
విస్తరించిన మహా సముద్రం……లాంటిది….
అనంతమైన శిల్పకళ…..
అందులో అపురూప శిల్పకళా వైభవం
మన రామప్ప ప్రాభవం……
విపత్తులెన్నింటినో దాటుకోని
విధ్వంసాలకు కొంత చిధ్రమైనా…
వందలేండ్లు వర్ధిల్లిన వారసత్వ కట్టడం
శ్రీ రామలింగేశ్వరుని ఆలయం
ఆధునికతల విదేశీ పోకడల
అవపోషణల సమాహారం….
అపురూప శిల్పకళా వైభవం
అద్భుతమైన రామప్ప దేవాలయం
అద్భుతమైన రామప్ప దేవాలయం
శిల్పి రామప్ప పేరున ప్రఖ్యాతమాయె
అందుకున్నది నేడు విశ్వ నీరాజనం….
చెవులకు చారడేసి దుద్దులతో
చెప్పులేమో ఎత్తు మడిమలు వేసుకుని
అందమంత రాశిపోసుకున్న మదనికలు
ఆకర్షించే శిల్ప సౌందర్యం అజరామరం….
అర్ధనిమీలితమైన ద్రుక్కోచరములు
ఆర్ద్రత నిండిన పలకరింపులు
పలికించని భావమంటూ లేదు
పులకించని హృదయమంటూ లేదు ....
దారం దూరే సన్నని సందులు
చిత్రంగా రాతిలోన కత్తిరించిరి
రమ్యమైన రాతి స్థంభాలతోనే
గర్భాలయంలో వెలుగులు పూయించి
అపురూప శిల్పకళకు ఆనవాళ్ళాయి నిలిచె…..
కర్ర తొలిచిన తీరుగా…కనువిందు చేసే..
కృష్ణ శిలల పైన కుందనపు బొమ్మలు
మృదంగ వాద్యం ముదముగ మీటుచు
మనసులు దోచే ..మదనికల భంగిమలు ....
కాకతి మాతా కరుణా కటాక్షాలతో
వెన్నయతో పయనమైన వంశం
వెలిసె కదా వెలుగులు నింప తెలుగు జాతిన...
తేట తెల్లమై మన ఓరుగల్లు కేంద్రంగా ....
జగతి మెచ్చే శిల్ప కళా సంపదలు
వేయి స్థంబాల గుడి, రామప్ప గుడి
ఏక శిలా కీర్తి తోరణాలు…ఎనలేని
వెన్నయతో పయనమైన వంశం
వెలిసె కదా వెలుగులు నింప తెలుగు జాతిన...
తేట తెల్లమై మన ఓరుగల్లు కేంద్రంగా ....
జగతి మెచ్చే శిల్ప కళా సంపదలు
వేయి స్థంబాల గుడి, రామప్ప గుడి
ఏక శిలా కీర్తి తోరణాలు…ఎనలేని
శిల్పకళా ఖండాలై .. తొణికిసలాడంగ
జాతి రత్నములై జగతి చరితన వెలిసె....
జాతి రత్నములై జగతి చరితన వెలిసె....
ఆధ్యాత్మికతలకు ఆలంబనమై
కళాకారుల కీర్తించిన ఘనతల నిండిన
“రామప్ప ఏ సింఫనీ ఇన్ స్టోన్స్ “ గా
నాడే కొనియాడబడే కోరి మన పి వి గారిచే ...
“రామప్ప ఏ సింఫనీ ఇన్ స్టోన్స్ “ గా
నాడే కొనియాడబడే కోరి మన పి వి గారిచే ...
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment