సృజన లోకం
తేదీ : 12-08-2021
శీర్షిక :
అపర బ్రాహ్మలు
కవిత సంఖ్య : 726
అనుభవాల జీవన చరిత్రలో
భిన్నమైన శైలిలో సృశి స్తూ
మానవ జీవన పురోభివృద్ధికి ...
ఉన్నతికి... దారులేర్పరచింది
అరువది నాల్గు కళలు ..
పరమాత్మ సృష్టిలో ప్రతీది వరం ...
పరితపించే సృజనుల లోకంలో
భవిష్య దర్శనాల రాబోయే బాధలను
నివారించి సమాజ శ్రేయస్సు కోరడం .....
కలయో...నిజమో....తేల్చుకోలేని
భ్రమల ఊరేగించి ఉర్రూతలూగించి
సెహబాశుల వెన్ను తట్టింపులతో
తనివి తీర్చి తృప్తుల మూటల నందించేది .....
నాటి శిల్పకళ ....
వైవిధ్య విజ్ఞానాల సమున్నతం
కాగితం కలమే కంటనీరు పెట్టించి
ఆత్మీయతలను అనురాగాలను జోడించి
అలవోకగా అన్నీ ఒలికించే సాధనమిక్కడ....
కత్తులు తలలు నరికితే ... కలాలు
కవన పుష్పాలను పూయించి ప్రజల
తల రాతలను తమ గీతలతో సృశించి
భవ్యమైన మార్గ నిర్దేశనం చేయడమే.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment