మన జండా
తేది: 15-08-2021
శీర్షిక: మువ్వన్నెల మన జండా
కవిత సంఖ్య : 739.
మువ్వన్నెల మన జండా
మురిపించును ఎదనిండా ....
ఆగష్టు పదిహేనున మన
ఆనందాల స్వాతంత్ర్యం
అమరవీరుని జ్ఞాపకాల
అమృత వజ్రోత్సవం …. //మువ్వ//
ఆమనిలా వచ్చే చూడు
అజేయమైన మన జండా
సద్భావన సందళ్ళతో
సమున్నతమే నిండుగా .... //మువ్వ//
త్రివర్ణాల శోభితమై
తిప్పలనే బాపింది
పిల్లలకు పెద్దలకు
సంబరాలు తెచ్చింది //మువ్వ//
పింగళి వెంకన్న మంత్రం
ఫిరంగిలా నిలిచిన యంత్రం
కాషాయం పౌరుషమై
కలబడు మన సైనికుడు … //మువ్వ//
పాలతెలుపు శాంతికి
ప్రపంచ కపోత చిహ్నం
ఆకుపచ్చ నిలిచింది
హాలికునికి ఆయుధమై .... //మువ్వ//
అశోకుని ధర్మ చక్రం
ఆక్రమించె మధ్యలోన
సంఘం శరణం గచ్చామంటుూ
సమ సమాజ సూత్రంగా ..... //మువ్వ//
సరిహద్దున జవానుకు
పురివేయును ప్రాణవాయువై
పొరుగు ధూర్తుల శిక్షించి
మనహద్దులు రక్షించ.... //మువ్వ//
వందే మాతరమంటూ
వరస కలుపె గొంతులు
జన గణ మని పాడెనే
జగతిన భారతీయులు. //మువ్వ//
నరనరాన దేశభక్తి
నగారా మోగించగ
ప్రతి వారి గుండెనిండ
పండగై నిలిచింది..... //మువ్వ//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment