Thursday, October 14, 2021

చిత్ర కవిత తేది : 27-08-2021 శీర్షిక : తరువు సూచనలు ....

 చిత్ర కవిత 

తేది : 27-08-2021
శీర్షిక : తరువు సూచనలు .... 
కవిత సంఖ్య : 30+13

ప్రతి నిమిషం పరితపించే 
తరువు... మరకతముగా అవనిని 
శోభింప చేసి... శోశంతా ఉగ్గబట్టి 
తనువంతా సమర్పింపింపచేసి
జీవకోటికి ఉపకరించు నిలువెల్లా .... 

పంచి ఇవ్వడమే పరమావధిగా 
పెట్టుకున్న ప్రకృతి మాత  ప్రతినిధి 
జీవకోటి ఆకళ్ళను తీర్చుతూ ఆవాసంగా 
ఆదుకుని ఔషధాలను ప్రాణవాయువిచ్చే పచ్చని చెట్లు....  

నాగరికతల పేరుతో అడుగులేసి 
నరికివేత మొదలెట్టిన మానవుడు 
స్వార్థాలను తలకెక్కించుకుని 
పారమార్థాలన్నింటికి  తిలోదకాలిచ్చె ... 

నడుస్తున్న కాల చరితలో... 
నడమంత్రపు తలబిరుసు సిరులొ ... 
మానవత్వం మరిచిన మనుషులు  
మమతల తావిని గుర్తించలేకపోతుండే  ..... 

పచ్చని చెట్లపై పడగ నీడలా 
పగబట్టినట్టు మనుషులేమో 
వెచ్చని విషం కక్కుతూ ఉసురు
తీస్తున్నారు అడ్డంగా నరుకుతూ ..... 

వేడెక్కి మరుగుతున్న వాతావరణం... 
పాడెక్కి పరితపిస్తున్న పర్యావరణం ... 
మనిషిలోని మార్పులకై  ఎదురుచూస్తూ 
మనందరికి సూచనలిస్తునే ఉన్నాయి  ..... 

No comments:

Post a Comment