Thursday, October 14, 2021

రక్షాబంధన్ తేది: 22-08-2021 శీర్షిక : అభయ హస్తము

 రక్షాబంధన్ 

తేది: 22-08-2021
శీర్షిక : అభయ హస్తము 
కవిత సంఖ్య : 734 

సంస్కృతీ  సంప్రదాయాల 
చరిత్రల నీడలలో... అవిభాజ్య 
కుటుంబాల ఆలనలలో.... 
అనురాగాల తోటలలో పెరిగిన దేశం .... 

ఆత్మీయతలకు ఆయువు పట్టు 
అనుబంధాలకు పుట్టినిల్లు 
వారసత్వాలకు పెట్టనికోట 
కొదువలేదు మన హైందవాన .... 

అమ్మానాన్నల ఆత్మీయతలు 
తోబుట్టువుల మధ్య ప్రేమలు 
పొరుగులతో  ఇరుగు బంధాలు 
ప్రతీది ప్రత్యేకమే భారతానా .... 

లక్ష్మీనారాయణులను లాలిత్యమై 
ఆదిదంపతులను ఆరాటంతో 
ప్రాణప్రదంగా పూజించెను... శచీదేవి 
తనభర్త క్షేమం కోరి ప్రథమంగా ..... 

కృష్ణుని చూపుడువేలుకు తగిలిన 
గాయానికి గుండె చెరువయిన ద్రౌపతి 
కన్నీటి పర్యంతమయి  కట్టుకట్టే నాడు 
బంగారి కొంగును బరబరా చింపి ….. 

శ్రావణ పౌర్ణమి శ్రేష్టమాయె 
అభయ హస్తలే మూలమయి నిలిచె 
రక్షా బంధనాల రతనాల కథలకు …..నాడు

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment