Thursday, October 21, 2021

సంయమన సూత్రం తేది: 03-09-2021 శీర్షిక : నిగ్రహ నీరాజనం

 సంయమన సూత్రం

తేది: 03-09-2021
శీర్షిక : నిగ్రహ నీరాజనం 
కవిత సంఖ్య :  745

మాటకు మాట సమాధానమైతే 
మంత్రించిన వాదులాటలే  కదా 
మంత్రించిన మౌనమే సమాధానమైతే 
మహనీయులు పాటించే సంయనమే ..... 

నాగరికతలలో నడకలు నేర్చుకుని 
పారిశ్రామికీకతలలో పరుగులు పెట్టి 
సాంకేతికతల సౌలభ్య కాల చక్రములో 
స్వార్థాలు మూట కట్టుకుంటున్నారు .... 

లోకో భిన్న రుచిలా ...ఒక్కొక్కరి 
ఆలోచనలు ఒక్కోక్క  రకం....  
ఇల్లైనా ...దేశమైనా ... విశ్వమైనా 
ఇగురంగా కలిసి జీవించాలంటే  
ఇంపైన సంయమనం పొదువుకోవాలి.... 

అప్పుడప్పుడు సంయమనం 
అల్పుల ఆలోచనల మదిలోన 
చేతగాని తనంగా చిత్రీకరణైనా 
అనన్య అంతఃకరణ శుద్ధిమయం .. 

అహపు అశ్వాలకు కళ్లెమేయగలిగితే
ఆలోచనల తరంగాల మధనానికి 
సంయమనం ఒక ప్రత్యేక సంతులిత 
ఆరోగ్య ప్రదాయిని సంఘమునందు…. 

అందరు బాగుండాలి అందులో  
నేనుండాలనే సంకల్పమే స్వర్గతుల్యం ... 
అక్షరాస్యతలు అభివృద్ధి  జరిగితే  
నిగ్రహ నీరాజనాలకు మార్గమౌతుంది 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment