Thursday, October 21, 2021

చమత్కారం తేది: 03-09-2021 శీర్షిక: లోకకళ్యాణమే ....

 చమత్కారం 

తేది: 03-09-2021
శీర్షిక: లోకకళ్యాణమే .... 
కవిత సంఖ్య : 160 

ఆశ్చర్యానందాలను కలగలిపి 
ఆతిథ్యమిచ్చే అతిథేయుడు 
ప్రతి మాటలో పనిలో పరిహాసాలను 
పదిలంగా పూయించే తోటమాలి ... 

అందరికి అన్నీ సాధ్యం కాకపోయినా 
కొందరికి మాత్రమది కొట్టినపిండి 
సరదాలను పొట్లం కట్టి సావధానంగా 
పది మంది మదిలో పట్టు సాధిస్తాడు .... 

నిత్యకృత్యాలలో నిబిడీకృతమైతేనే 
నీటి మీద తెప్పలా మనిషి జీవితం 
సుతారంగా సునాయాసయంగా 
కడలి తీరం పూవులా చేరుతుంది ...... 

అతి సర్వత్ర వర్జయేత్  లాగ 
హద్దులు దాటితే ఛీత్కారమే ..... 
పరిమితులలో పండించే 
శృతి మించని చమత్కారం 
గతి తప్పని లోకకళ్యాణమే 

నగునూరి రాజన్న 
కరినగరము. 

No comments:

Post a Comment