పరిమళాల గాలులు
తేది : 02-09-2021
శీర్షిక : అసలైన పరిమళాలు
కవిత సంఖ్య : 158
పోరాడి గెలిచామనుకున్న యోధులు
జనులంతా ... స్వాతంత్య్ర సంబరాల
ఫలాలను తలుచుకుని ఆనందాల
పండగలు జరుపుకుంటూండగా ....
సందట్లో సడేమియాల్లా తల్లి భారతి
తనువు చీల్చి పంచుకునే వంచన
తలపులతో కొంత మంది కపట దురాశ
రాజకీయ పరులు రంగులు పులుముకున్నారు ....
అంతలోనే స్వార్థాల అధికార మత్తులో
జోగి సాగిలపడే సర్దారులంతా దేశ
సంప్రదాయాలను భ్రష్టు పట్టించే
వ్రత దీక్షలో తలమునకలైపోయారు .....
తప్పుడు లెక్కల తక్కెడలన్నీ కూడి తమ
తమ తప్పులెక్కడ పొక్కకుండా పొల్లుపోని
రీతిలో జాగ్రత్తలన్నీ కూడా బలుక్కుని
ఒకటొకటిగా దేశపు తరువు కొమ్మలను విరిచారు .....
ఏడున్నరేళ్ళ దశాబ్ద గ్రహపాట్ల తదుపరి
ఒకటొకటిగా విచ్చుకుంటున్న పాప పంకిలాలు
కంటుంటే వింటుంటే ఒళ్ళంతా జెర్లు పాకిన
గగుర్పాటులే .... ఒడువని గాథల ముచ్చట్లే ....
ఇప్పుడిప్పుడే ఒద్దికగా ఒకటొకటి
చిక్కుముడులు విప్పుకుంటూ పోతున్న
వాళ్ళను చూస్తుంటే ... అవును అసలైన
పరిమళాల గాలులు వీచడం మొదలైనదన్న
నమ్మకం పెరుగుతున్నది.... ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment