Thursday, October 14, 2021

కదిలే కాలం తేది: 23-08-2021

 కదిలే కాలం 

తేది: 23-08-2021
శీర్షిక: గమ్యం 
కవిత సంఖ్య: 155

ఆకులు అలములు ఆశ్రయించుకుని 
కందమూలములు జీర్ణించుకుని 
రాతి యుగములు రంగరించుకుని 
అడుగులు వేసిన ఆటవికుడు .... 

కొండ గుహలలో నివసించి 
రాతి పనిముట్లు కనిపెట్టుకుని 
పచ్చిమాంసాలు పంచుకుని 
కడుపులు నింపుకున్న కథలేనాయె .... 

సంఘటితమైన నివాసాలతో 
సాహాసాల ఊపిరులూదుకుని 
పట్టణాలుగా ఫరిడవిల్లుతూ 
పారిశ్రామిక ప్రగతి బాటలో అడుగులేసె…. 

సాంకేతికతలు సంధించుకుని 
గగన విహారములో దూసుకెళ్ళి
గ్రహాంతరాలకు పయనమైనా … 
పచ్చినెత్తురు వాసనలు వదలని 
పామరుడేనని ఋుజువులాయె 
అక్కడక్కడ…. అప్పుడప్పుడు …. 

ఆగని కాలానికి ఎవరూ గాలం  
వేయలేకపోయినా ... 
అందరూ అందిపుచ్చుకుని నడకలు
సాగిస్తే…ఎంతోకొంత పురోగతేనంటూ .... 
గమ్యం చేరుకునే గమ్మత్తు..... లేదంటే 
మళ్ళీ మొదటి దశకు చేరుకునే 
దిగజారుడు తనమేనాయె….. 

నగునూరి రాజన్న
కరినగరము.   

No comments:

Post a Comment