Monday, October 4, 2021

తపన తేది:30-07-2021

 తపన 

తేది:30-07-2021
శీర్షిక: తపిస్తేనే… కవిత్వం… 
కవిత సంఖ్య: 147

జీవరాశిలో మానవాళి భోగరాశి 
మాత్రమే కాదు... సంవేదనలను 
లోతుగా గాఢంగా సృషించి 
ప్రతిబింబించగల ధీశాలి ..... 

జీవన నిత్యాగ్నిహోత్రంలో ఉద్భవించే 
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది 
గుణాలకు లొంగి... ఇష్టాల తీరాలలో 
సుఖాలను.. ఆనందాలను.. సంతోషాలను
ఆత్మీయతలను.. ఆర్తి.. కరుణ..
దయ... దాక్షిణ్యాలను ప్రదర్శించి ...
కష్టాల కడలిలో దుఃఖాలను.. బాధలను... 
కఠినాలను... స్పర్శిస్తూనే  ఉంటాము... 

సమయానుకూలంగా స్పందిస్తూ
స్పర్శించిన హృదయం కురిపించే
తంపర తంపరలైన భావ తరంగాలను 
ప్రోది చేసుకుని… ఏరుకుని… 
అక్షరాల మాలలు అల్లే క్రమములో  
పడే తలపోతల వడపోతలే తపనలు…. 

తపిస్తేనే… హృదయాంతరాల భావాల
రెక్కల తూనీరాలను మాధుర్య రస 
భావనలతో గాఢమైన సాహిత్యమై
ప్రతిబింబించేదే కవిత్వం……. 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment