Monday, October 4, 2021

శ్రావణ లక్ష్మి తేది : 10-08-2021 శీర్షిక : శుభాల మాసం

 శ్రావణ లక్ష్మి

తేది  : 10-08-2021
శీర్షిక : శుభాల మాసం 
కవిత సంఖ్య  :149

శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రమైన  
శ్రవణ నక్షత్రం పౌర్ణమిన శశిని చేరి 
శ్రావణమై వర్దిల్లె ఈ మాసం 
దివ్యంగా శ్రావ్యంగా ..... 

తొలకరితో పలకరించే 
చిటపట చినుకుల పలకరింపులకు  
పులకించిన ధరణీ మాత ...
పచ్చ కొక చుట్టుకున్న 
పడుచు ముతైదువై పోయి...  

ఆడవారినందరిని అక్కున 
చేర్చుకుని మంగళ గౌరీ 
వ్రతాలు చేయించి వాయినాలు 
ఇచ్చి పుచుకుంటుంది  ......  

పట్టు చీరలు కట్టుకుని 
పడుచులంతా కదిలేరు 
వరలక్ష్మీ వ్రతాల 
వాయనాలకై ..... 

కాల గమన మార్పుల్లో 
వచ్చే కార్తె ఋతువుల 
ముసురులకు అల్లుకునే 
సూక్ష్మజీవుల బెడద 
నివారణకై పాటించే 
శుచి శుభ్రతలు ..... 

పిల్లా పాప సల్లగుండాలని 
నాగుల గరుడ పంచమిలలో 
పుట్టలకు పాలు పోసి 
మొక్కులప్పజెప్పేదరు .... 

తోబుట్టువుల రక్షకోరి 
సోదరీ మణులంతా 
సోదరులకు రక్షా బంధనములు 
ఆచరించేది పూర్ణిమ రోజు .... 

బ్రహ్మచారులకు గృహస్తులకు 
శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టానాల
సిద్ధికై నూతన యజ్ఞోపవీత 
ధారణం ఈ పౌర్ణమికే ..... 

ఔషధాలు తోడు రాగ 
కొత్తనీటి స్నానాలకై 
కొంత ఉబలాటం చూపి 
నదీ స్నానాలటంచు 
వనభోజనాలుకై తరలి 
వెళ్ళేరు ....... 

స్వేచ్ఛ వాయువులు 
పీల్చుతున్న మనందరం 
మననం చేసుకునే స్వాతంత్య్ర 
దినము  ఈ మాసమందే .... 

ఉదయ సాయంత్ర భగవన్నామ 
స్మరణలతో మోర్మోగే మాసం 



నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment