ఆగమనానందం
తేదీ : 25-08-2021
శీర్షిక : మధురమైన ఎదురు చూపులు
కవిత సంఖ్య : 737
పాలకుల పాటి పనితనములో
పారిశ్రామికతల పరుగులు దాటి
సాంకేతికతల సంధి సమయంలో
సొబగులద్దుకునే సౌలభ్యాలో ...
తొంబదుల్లోని తమ్ములందరికి
వామ హస్తం దీవెనల పాలైపోయి
వరుసకట్టిరి వానప్రస్థానికై పరదేశం
వామనుడు బలిని పంపిన ప్రాంతం ....
వందల వేల కుటుంబాలలోని
వారసులంతా వలస వెళ్ళిరి...
తమను తాముగా రూడీపరచుకొనగ
దేశ కీర్తిలో కలికితురాయిగా నిలువ….
దేశంకాని దేశమెల్లినా ...తరువులై
చిగురిస్తూ పరువుగా పదిమందిలో
నిలిచి గుండెలు చిక్కబట్టుకుని
దేశ ఉన్నతిలో దశలు మార్చిరి ....
ఏండ్లకేండ్లు ఎదురు చూచిన
కన్నవారికి... మధురమే వారి ఆగమనం
జీవితాన వసంతమే .....మత్త
కోకిలల కుహూ కుహులే ...
గ్రీష్మపు ఎండలకు తల్లడిల్లి
తనువున నెర్రెలూనిన అవని
మాతకు ... తొలకరి చినుకుల
పరిమళాలల్లే ....హాలికుని కళ్ళల్లో
అనంతమైన మెరుపు కాంతులల్లే ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment